ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించాలి

– సీపీఐ(ఎం) కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి మట్టిపల్లి సైదులు
నవతెలంగాణ-చిలుకూరు
ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించాలని సీపీఐ(ఎం) కోదాడ ఎమ్మెల్యే అభ్యర్థి మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని బేతవోలు గ్రామంలో ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.అసెంబ్లీ ఎన్నికలలో ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీకి పంపించాలని, కార్యకర్తలు ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని సూచించారు బీఆర్‌ఎస్‌,కాంగ్రెస్‌, బీజేపీ ప్రజలకు డబ్బులను ఎరగా వేసి మాయమాటలతో గద్దెనెక్కాలని చూస్తున్నాయన్నారు.ఆయా పార్టీల అభ్యర్థులను అసెంబ్లీకి పంపిస్తే ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు.ఒక్కసారి వేసే ఓటు ఐదేండ్లపాటు ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టుతుందన్నారు.ప్రజలు తెలివిగా గుర్తించి ప్రజల పక్షాన నిలబడి పోరాడే వ్యక్తులను అసెంబ్లీకి పంపించాలన్నారు .రాష్ట్రం అభివద్ధి చెందాలన్నా.. ప్రజలు అభివద్ధిలోకి రావాలన్నా ఎర్రజెండా పార్టీ అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.కేసీఆర్‌ కల్లబొల్లి పథకాలతో ప్రజలను మోసం చేస్తున్నారని సూచించారు.ఇప్పటికైనా ప్రజలు విషయాన్ని గమనించి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు.కొంతమంది ఎమ్మెల్యేలు స్వార్థ బుద్ధితో డబ్బు వ్యామోహంతో అక్రమ అర్జన చేస్తూ కోట్లు సంపాదిస్తూ ప్రస్తుత జరుగుతున్న ఎన్నికలలో డబ్బులతో ప్రచారం ఉధతంగా నిర్వహిస్తున్నారన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు జె.నర్సింహారావు, మండలకార్యదర్శి నాగాటి చిన్న రాములు,సీనియర్‌ నాయకులు బత్తిని అలివేలువెంకటయ్య, మండల కమిటీ సభ్యులు నారసాని వెంకటేశ్వర్లు, ఎల్లయ్య, పిల్లి వీరమల్లు, గట్టు లింగయ్య, నారబోయిన కృష్ణ, అంజనేయులు పాల్గొన్నారు.