ప్రశ్నించే గొంతుక నవతెలంగాణ దినపత్రిక సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిల

సమన్వయంతో ముందుకు సాగాలి..
వరంగల్‌ ఉమ్మడి జిల్లా రీజనల్‌ మేనేజర్‌ దేవేందర్‌ రావు
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్‌
పేదప్రజల సమస్యలపై నిరం తరం పోరాడుతూ ప్రశ్నించే గొంతుక ‘నవతెలంగాణ’ పత్రిక మాత్రమేనని ఈ పత్రికను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నవతెలంగాణ విలేకరులు సిపిఐ (ఎం) పార్టీ ప్రజాసంఘాల నాయకుల నవ తెలంగాణ క్యాంపెయిన్‌ ఉమ్మడి సమావేశానికి నవతెలంగాణ జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ ఎర్రం సతీష్‌ కుమార్‌ అధ్యక్షత వహించగా… నవతెలంగాణ ఉమ్మడి వరంగల్‌ జిల్లా రీజనల్‌ మేనేజర్‌ దేవేందర్‌ రావు తో కలిసి సిపిఐ(ఎం )జిల్లా కార్యదర్శి బందు సాయిలు ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ…. దాదాపు మీడియా అంతా కార్పోరేట్‌ కబంధహస్తాల్లో ఉందని కేవలం కార్మిక పే ద బడుగు, బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వం దష్టికి తీసుకువచ్చేది ‘నవతెలంగాణ’ మాత్రమే అన్నారు. కాబట్టి నవతెలంగాణ పత్రికన ప్రతి ఒక్కరు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. పత్రిక సర్క్యులేషన్‌ పెంచడానికి మండలాల వారీగా కమిటీలు పూర్తి బా ధ్యత తీసుకుని అనుకున్న లక్ష్యం సాధించాలని కోరారు. గత సమావేశం నుండి ఇప్పటివరకు సుమారు 50 పేపర్లు జిల్లా వ్యాప్తంగా చందాలు అయ్యాయని జిల్లా కేంద్రంలో 33 పత్రికలు కొనసాగుతున్నాయన్నారు. ఈనెల 15 వరకు ‘నవతెలంగాణ’ పత్రిక స ర్క్యులేష న్‌ పెంచడానికి ప్రత్యేక కార్యచరణ చేపట్టా మని పార్టీ బాధ్యులు విలేకరులు సమన్వయంతో పత్రిక సర్క్యులేషన్‌ పెంచాలని కోరారు. నవతెలంగాణ ఉమ్మడి వరంగల్‌ జిల్లా రీజినల్‌ మేనేజర్‌ దేవేందర్‌ రావు మాట్లాడుతూ.. జిల్లాలోని ఆయా మండలాల విలేకరులు, పార్టీ బాధ్యులు సమన్వయంతో ముందుకు సాగా లన్నారు. కరోనా కష్టకాలంలో సైతం పత్రిక ముందుకు సాగుతుందని రానున్న ఎన్నికల దష్ట్యా మన గలాన్ని వినిపించేందుకు సర్కులేషన్‌ ముఖ్యమైందన్నారు. ప్రతి మండలంలో 25 పేపర్లకు తగ్గకుండా చందాలు చేర్పించాలని సూచిం చారు. విలేకరులతోపాటు పార్టీ ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు చందా దారులను చేర్పించి అభివద్ధికి తోడ్పడాలన్నారు.సమిష్టి కషితో ప్రస్తుతం పత్రిక విజయవంతంగా నడిపించడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 33 సంవత్సరం చందాలు కావడం అభినందనీయమని కొనియాడారు. పత్రికా చందాలు మరింత పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ జిల్లా జిల్లా ఇన్చార్జి సాధన పల్లి సుధాకర్‌, సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొలం రాజేందర్‌,జిల్లా కమిటీ సభ్యులు, సకినాలా మల్లయ్య,గుర్రం దేవేందర్‌,అత్కురి.శ్రీకాంత్‌, పార్టీ సభ్యులు శ్రవణ్‌,నరేష్‌,రవికుమార్‌, రమేష్‌, ప్రీతి, నవతెలంగాణ విలేకరులు దూలం కుమారస్వామి, కాట్రేవుల లచ్చయ్య, కుమార్‌ యాదవ్‌, రహీం పాషా, వెల్దండ సత్యనారాయణ, రహీం, గోనె సుధాకర్‌, సజన్‌, తదితరులు పాల్గొన్నారు.