పేద ప్రజల గొంతుక నవతెలంగాణ

– క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పేద ప్రజల గొంతుక నవతెలంగాణ అని  జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. శనివారంరోజున మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం కార్యక్రమం సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే నవతెలంగాణ దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలకు అవసరమైన విషయాలను వారి కష్టాలను ఎప్పటికప్పుడు వెలికిస్తూ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తూ, వారి సమస్యల పరిష్కారానికి నవతెలంగాణ కృషి చేస్తుందన్నారు. అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ ప్రజల సమస్యలు తీర్చకుంటే నిర్భయంగా ప్రజల వైపు ఉంటూ ప్రజలకు న్యాయం జరిగే విధంగా పత్రిక కృషి చేస్తుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతాప్ రెడ్డి,ఎంపీడీవో రాణి,జెడ్పిటిసిచంద్రభాగ,ఎంపీఓ సురేకాంత్,ఎమ్మార్వో దశరథ్, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, కోఆప్షన్ నెంబర్ జాఫర్ష,ఆయా గ్రామాలసర్పంచులు పాల్గొన్నారు.