
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఓటరు లిస్టులో నివాస ఆధారితంగా వార్డుల వారీ ఓటరు లిస్టును క్రమబద్ధీకరించాలని హుస్నాబాద్ ఎంపీడీవో కు గురువారం అఖిలపక్ష పార్టీ నాయకులు మండల పరిషత్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా వార్డులలో ఓటర్ల వారి జాబితాలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు చేయాలని కోరారు .అసెంబ్లీ ఎలక్షన్ల ఓటర్ల జాబితాకు అణుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు క్రమబద్ధీకరించాలని,ఏ ఒక్క ఓటరు డిలీట్ చేయవద్దని, ఏ చిన్న సమస్య ఉన్నా బి ఎల్ ఓ ల పొరపాట్లను సరిదిద్దాలని ఎంపీడీవో కు వివరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షుడు గంగం మదన్ సుదన్ రెడ్డి, బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి ఎనగందుల శంకర్ , ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోయిన సదన్ కుమార్, బహుజన్ సమాజ్ పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు దుండ్ర రాంబాబు, చెంచల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.