-18 ఎండ్లు నిండిన వారందరిని ఓటర్ గా నమోదు చేయాలని సూచన
నవతెలంగాణ-బెజ్జంకి
మండలంలోని అయా గ్రామాల్లో పారదర్శకంగా ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టాలని తహసిల్దార్ శ్యామ్ తెలిపారు.బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదిక యందు ఓటర్ నమోదు ప్రక్రియపై బీఎల్ఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ రాబోవు పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా జనవరి 1,2024 నాటికి 18 ఎండ్లు నిండిన వారందరిని ఓటర్ గా నమోదు చేసి మృతిచెందిన వారి వివరాలను ఓటర్ జాబితాలో సవరణలు చేయాలని బీఎల్ఓలకు తహసిల్దార్ సూచించారు.అయా గ్రామాల బీఎల్ఓలు హజరయ్యారు.