
నవతెలంగాణ-బెజ్జంకి
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహించనున్న నేపథ్యంతో మండలంలోని అయా గ్రామాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని తహసిల్దార్ నల్లా వెంకట్ రెడ్డి తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక యందు ఓటర్ల నమోదు ప్రక్రియపై మండలంలోని అయా గ్రామాల బీఎల్ఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ వెంకట్ మాట్లాడారు.18 ఎండ్లు నిండి ఆర్హులైన వారందరిని ఓటర్లుగా నమోదు చేయాలని,ఓటర్ల వివరాల్లో తప్పులను సవరించాలన్నారు.నాయిభ్ తహసిల్దార్ పార్థసారథి,ఆర్ఐ రాజయ్య,అయా గ్రామాల బీఎల్ఓలు హజరయ్యారు.
వయో వృద్ధులకు తహసిల్దార్ సన్మానం..
ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని తహసీల్ కార్యలయం యందు తహసిల్దార్ వెంకట్ రెడ్డి పలువురి వయో వృద్ధులను సోమవారం శాలువా కప్పి ఘనంగా సన్మానించి గౌరవించారు. సమాజంలోని వయో వృద్ధులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని వెంకట్ రెడ్డి తెలిపారు.
తహసిల్దార్ ను సన్మానించిన అంగన్వాడీలు..
మండల కేంద్రంలోని తహసిల్ కార్యలయంలో తహసిల్దార్ వెంకట్ రెడ్డిని సోమవారం మండలంలోని అయా గ్రామాల అంగన్వాడీ ఉపాధ్యాయులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.