నవతెలంగాణ-బెజ్జంకి
ఓటర్ జాభితాలో నూతనంగా నమోదైన,గతంలో నమోదు చేసిన కుటుంబంలోని ఓటర్లను ఒకే భూతుయందు,ఒకే దగ్గర చేర్చేల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులకు కాంగ్రెస్ శ్రేణులు విజ్ఞప్తి చేశారు.శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్ యందు తహసిల్దార్ శ్యామ్ కు కుటుంబంలోని ఓటర్లను ఒకే భూతులో ఒకే దగ్గరగా చేర్చాలని కాంగ్రెస్ నాయకులు మానాల రవి,దోనే వెంకటేశ్వర్ రావు,మెట్ట నాగారాజు, మహేశ్ వినతిపత్రాలందజేశారు. ఇతర రాష్ట్రాల నుండి జీవానోపాధి కోసం వచ్చి స్థానిక ఓటర్లుగా నమోదు చేసుకున్న వారిని గుర్తించి ఎన్నికల నిబంధనల ప్రకారం తగు చర్యలు చేపట్టాలని తహసిల్దారుకు విజ్ఞప్తి చేసినట్టు కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు.