నేతానిగా ఉన్న అచ్చు తప్పును సవరించి నేతకానిగా మార్చాలి

The vowel that is neta should be corrected and changed to netakan– నేతకాని సంక్షేమ సంఘం మండల శాఖ డిమాండ్
నవతెలంగాణ – జన్నారం
ఎస్సీ కేటగిరిలో  40 సీరియల్ నంబర్లో నేతకానికి బదులుగా నేతాని అని ఉన్న అచ్చుతప్పును  సవరించి నేతకాని సమాజానికి విద్య ఉద్యోగ సామాజిక రాజకీయ రంగాల్లో న్యాయం చేయాలని  నేతకాని సంక్షేమ సంఘం జన్నారం మండల అధ్యక్షుడు  రత్నం లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో పత్రికా విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం తాసిల్దార్ కార్యాలయాల ద్వారా ఆన్లైన్ నుండి నేతకాని  కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ గెజిట్ నందు ఉన్న అచ్చు తప్పును సవరించలేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అచ్చుతప్పును సవరించి నేతకానిగా మార్చాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన నిర్వహిస్తున్నందున నేతకాని కులస్తులకు విద్య ఉద్యోగ సామాజిక  రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఎస్సీ వర్గీకరణ అనివార్యం అయినట్లై తే, నేతకాని జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారం, ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని  డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎస్సీ లో ఉన్న ప్రస్తుత రిజర్వేషన్లను 22 శాతానికి పెంచాలన్నారు. కార్యక్రమంలో నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్లపల్లి రాజేశ్వర్, రాష్ట్ర సీనియర్ నాయకులు బోర్లకుంట ప్రభుదాస్, రాష్ట్ర నాయకులు జాడి గంగాధర్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జాడివెంకటయ్య, ప్రధాన కార్యదర్శి రత్నం మాణిక్యం, ఉపాధ్యక్షులు బండారి స్వామి, జునుగురి మల్లయ్య, ఐరగడ్డ ప్రేమ్ కుమార్ వెంబడి శేఖర్, బోర్లకుంట శ్రీనివాస్ బండారి శ్రీధర్ పెరుగు మహేందర్, తదితరులు పాల్గొన్నారు.