గాయపడ్డ నెమలిని ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన వాకర్స్ 

The walkers handed over the injured pheasant to the forest officialsనవతెలంగాణ – చేర్యాల 
రోజువారీగా ఉదయం వాకింగ్ వెళుతున్న పలువురు  శనివారం చేర్యాల పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి పాఠశాల ఆవరణలో ఓ మూలన పడి ఉన్న నెమలిని గమనించి అక్కడికి వెళ్లి చూడగా నెమలికి మెడ, కాళ్లకు గాయాలు అయినట్లు వాకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా వాకర్స్100 కు ఫోన్ చేయడంతో పోలీస్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకుని నెమలిని తీసుకెళ్లి అటవీశాఖ అధికారులకు అప్పగించారు.వాకర్స్ అంబటి సిద్దయ్య, తూము నర్సింహులు, వేముల శ్రీనివాస్, మల్లేశం, సుభాష్,ప్రతాప్ రెడ్డి ఉన్నారు.కుక్కలా లేక కోతులు గాయపర్చాయ అనేది తెలియ రాలేదు.