– పండుగల సాయన్న విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన
– గ్రామ గ్రామానా పండుగల సాయన్న జయంతి వేడుకలు
నవతెలంగాణ కుల్కచర్ల
కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ గ్రామంలో తెలంగాణ రాబిన్ హుడ్ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన యోధుడు పండుగల సాయన్న జయంతి కార్య క్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అనం త రం ఆయన విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. కా ర్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనే యులు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
చాపల గూడెం గ్రామంలో…
పండుగల సాయన్న జయంతి కార్యక్రమాన్ని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించా రు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివా ళులర్పించి ఆయన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గండి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇప్పాయిపల్లి గ్రామంలో…
యువజన సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాబిన్ హుడ్ పండుగల సాయన్న జయంతి కార్యక్రమాన్ని ఘ నంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక నాయ కులు పాల్గొన్నారు.