
– పనులు చేసి అప్పుల పాలవుతున్న కింది స్థాయి నాయకులు
– అభివృద్ధి పనులు చేయడానికి భయపడుతున్న కాంట్రాక్టర్లు
నవతెలంగాణ – భైంసా
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు కాగితాలకే పరిమితమైతే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తీరు మారి అభివృద్ధి పనులు జరుగతాయనుకుంటే 9 నెలల పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ఉంది పరిస్థితి. ఒకప్పుడు ప్రజా ప్రతినిధులు, నిధులు విడుదల అయ్యాయని తెలిపితే గ్రామాల్లో చక చక పనులు సాగేవి. ఇప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. ప్రభుత్వం కోట్ల నిధులకు ప్రొసీడింగ్ లు ఇస్తున్న, ప్రస్తుతం ప్రభుత్వ తీరును చుస్తే అవ్వని ఉత్తుత్తివే అనిపిస్తుంది. గతంలో గ్రామాల్లో సర్పంచ్ లు అభివృద్ధి పనులు చేస్తే వారికి బిల్లులు రాక అప్పుల పాలయ్యారు. సర్పంచ్ ల పదవి కాలం ముగిశాక ఇప్పటి ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కనీస నిధులు ఇవ్వక పోవడంతో ప్రభుత్వ ఉద్యోగులైనా గ్రామ పంచాయతి కార్యదర్శులు అప్పులు తెచ్చి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితి వచ్చిదంటే పాలన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందొ అర్థమవుతుంది. గత మార్చి నెలలో ఉపాధి హామీ పథకం కింద ప్రతి మండలానికి కోటి నుంచి రెండు కోట్ల రూపాయలు నిధులు మంజూరయ్యాయి. కొత్త ప్రభుత్వం రాగానే ఉత్సహం తో ఉన్న కార్యకర్తలు అధికార పార్టీ వాళ్ళు, ఇక్కడ ఎమ్మెల్యే ప్రతి పక్షం ఉండడం తో బిజెపి వాళ్ళు పోటా పోటీగా సి. సి. రోడ్లు వేసేసారు. అప్పులు తెచ్చి పనులు చేస్తే ఏడు నెలలు గడిచిన పని చేసిన వారికి ఇప్పటికి బిల్లులు రాలేదు. దీంతో ప్రస్తుతం పనులు చేస్తే నిండుగా మునగాల్సి వస్తుందని గ్రామీణ నాయకులు భయపడుతున్నారు. ఇక జిల్లా ఇంచార్జి మంత్రి స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ పేరిట నిధులు ఇవ్వడం తో నియోజకవర్గం లో తాము నిధులు తెస్తున్నామని పత్రిక లకు ప్రకటన ఇస్తున్నప్పటికి ప్రభుత్వ తీరును చూసి ఎవ్వరు నమ్మలేక పోతున్నారు.. చేసిన పనులకు బిల్లులు ఇవ్వక పోవడం తో కొత్త పనులు చేయడానికి ముందుకు రావాలంటేనే భయపడుతున్నారు.. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి సర్కార్ తీరును అవలంభిస్తుండడం తో అభివృద్ధి ముందుకు సాగడం లేదు.