నవతెలంగాణ – గోవిందరావుపేట
సెప్టెంబర్ 28 న జరుగు జాతీయ లోక్ ఆదాలాత్
రాజీ మార్గమే రాజమార్గమని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ కమలాకర్ అన్నారు. ఆదివారం స్టేషన్లో కమలాకర్ మీడియాతో మాట్లాడారు. ఈనెల 28న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని సంబంధిత బాధ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ములుగు జిల్లా న్యాయ సేవధికార సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28 వరకు నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ లో కక్షి దారులు తమ వీలును బట్టి తమ తమ కేసులను రాజీ కుదుర్చుకునేల లోక్ అదాలత్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో రాజీ పడదగు కేసులు,క్రిమినల్, సివిల్ కేసులు, వివాహ కుటుంబ తగాదా కేసులు,ఆక్సిడెంట్ కేసులు, డిజాస్టర్ మనేజ్మెంట్ కేసులు, ఎక్సైజ్ కేసులు, ట్రాఫిక్ ఈ – చలన్ కేసులు, ఇతర రాజీ పడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారం తో పరిష్కరించుకోవచ్చు .కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షి దారులు హాజరు అయ్యి తమకేసులను వారికీ వీలైన రోజునే సెప్టెంబర్ 28 లోపు పరిష్కరించు కోగలరు అని సూచించారు.కేసులు ఉండి రాజి పడదలుచుకున్న వారు పూర్తి వివరాల కొరకై ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చని అన్నారు.