ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పార్టీ కార్యకర్తలకే సామాన్య ప్రజలకు అందలేదు..

– కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి
– కాంగ్రెస్ అభ్యర్థి ప్రొద్దుటూరి సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ- రెంజల్: గత పది సంవత్సరాలుగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు పార్టీ కార్యకర్తలకి అప్పగించారని, సామాన్యులకు ఎలాంటి పథకాలను అందించిన పాపాన పోలేదని కాంగ్రెస్  అభ్యర్థి పి. సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని శివాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన గ్రామంలోకి వచ్చారు. మహిళా సోదరీమణులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు దొందు దొందేనని, ప్రజలను మోసం చేయడంలో దిట్ట అని ఆయన ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాలుగా రైతులను మోసం చేశారని, తరుగు పేరుతో రైతులను దివాలా తీశరని ఆయన స్పష్టం చేశారు. ఆయన రంజల్ వస్తున్నారని తెలియడం మహిళలు మంగళహారతితో స్వాగతం పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మండల కేంద్రంలోని బందల రోడ్డు, మాచాపురం రోడ్డు, గంగమ్మ తల్లి రోడ్డు, తో పాటు బస్సుల కోసం శివాలయం నుంచి బస్టాండ్ వరకు బైపాస్ రోడ్డు పూర్తి చేయిస్తానని ఆయన పేర్కొన్నారు. రైతులు పండించిన పంటకు తరుగు పేరుతో నిలువున ముంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీ పథకాలను అందిస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు, మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు 2500, మహిళా సోదరీమణులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, పది లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా, ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేని వారికి ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షలు, నిరుద్యోగ భృతి యువతకు ప్రతి నెల 4వేల రూపాయలు, ప్రతి కుటుంబానికి 2 యూనిట్లు చిత విద్యుత్ కరెంటు, రైతు భరోసా పథకం కింద ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ, ప్రతి ఏటా 15 వేల రూపాయలు రైతులకు అందజేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు జి సాయి రెడ్డి, సిహెచ్ రాములు, జిల్లా నాయకులు జావిద్ ఉద్దీన్, ధనుంజయ్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు సురేందర్ గౌడ్, సీనియర్ నాయకులు నితిన్, ఎం ఎల్ రాజు, మండల ఉపాధ్యక్షులు గంగా కృష్ణ, సాయిబాబాగౌడ్, గంగా గౌడ్, మాజీ ఎంపీటీసీ సవిత, ఇందిరా రెడ్డి, బి రవి, యువజన మండల అధ్యక్షులు కార్తీక్ యాదవ్, సోక్కుల సాయిలు, షేక్ సద్దాం, సయ్యద్ సల్మాన్, సిద్ధ సాయిలు, శంషాద్దీన్, ఎల్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.