పోలీస్ అధికారుల,సిబ్బంది సంక్షేమనికి అధిక ప్రాధాన్యత..

The welfare of police officers and staff is given high priority.– ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం..
– నూతన జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభించి జిల్లా ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు కృషి..
– ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో పునరుద్ధరించిన పోలీస్ గెస్ట్ హౌస్,మహాలక్ష్మి విధి నుండి కేజీవిబి వరకు ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలు లను జిల్లా ఎస్పీ తో కలసి బుధవారం ప్రారంభించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్.సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన తోట రాజును అభినందించిన జిల్లా ఎస్పీ,ప్రభుత్వ విప్.ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వార జిల్లాలో శాంతి భద్రతలను కాపాడుతూనే, యువుత ను సన్మార్గంలో నడిపించుటకు ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో విన్నూత కార్యక్రమాలు చేపడుతు ముందుకు సాగడం అభినందనియం అని అన్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్నా పోలీసింగ్ లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రస్తుతం పోలీసు శాఖలో అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం అందిపుచ్చుకొని నేరాల నియంత్రణలో ముందుకు సాగుతున్నారన్నారు.వేములవాడ పట్టణ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని,ఒక్క సీసీ కెమెరా 100 మందికి పోలీస్ లతో సమానమని,నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర  కీలకం అన్నారు.దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయనికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల రద్దీ నేపథ్యంలో వారి భద్రత దృష్టిలో ఉంచుకొని వేములవాడ పట్టణంలో మోడ్రన్ పోలీస్ స్టేషన్, అదనపు సిబ్బంది కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకవేళ్లడం జరిగిందని,అదేవిధంగావేములవాడ పట్టణ పరిధిలో పెరిన ట్రాఫిక్ దృష్టిలో ఉంచుకొని త్వరలో ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి తీసుకరవడం జరుగుతుందన్నారు.
జిల్లా ప్రజలకు సత్వర సేవలు అందించడానికి జిల్లా కేంద్రంలో నిర్మించిన జిల్లా పోలీస్ కార్యాలయం త్వరలో నే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి నిక్కచ్చిగా ఉందని ఇప్పటికే జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విన్నూత కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తుందని, గంజాయి కి అలవాటు పడిన వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా కేద్రంలో డి ఆడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని,గ్రామాల్లో ఉన్న యువత తో మమేకం అవుతూ చెడు మార్గాలవైపు వెళ్లకుండా ఆవాహన కల్పించాలన్నారు.గతంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని,అంతే కాక ప్రతి నెల మండల స్థాయిలో జాబ్ మేళలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ.. శాంతి భద్రతల పర్యవేక్షణలో 24/7  విధులు నిర్వహించే సిబ్బందికి విశ్రాంతి ఎంతో అవసరం అని దానికి అనుగుణంగా వేములవాడ పట్టణ పరిధిలో సిబ్బంది కోసం విశ్రాంతి గదులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.పోలీస్ సిబ్బందికి ఆరోగ్యం,సంక్షేమాం విషయంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో సిబ్బంది మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించగలరన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సి.ఐ లు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్.ఐ లు మారుతి, రమేష్, అంజయ్య,  మునిసిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేష్ ,చిలక రమేష్, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.