పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

The welfare of poor people is the government's mission.– సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
పేద ప్రజలకు ఆర్థిక సాయం, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం, యాదగిరిగుట్ట పట్టణం, బీర్ల అయిలయ్య చేతుల మీదుగా ఎర్ర శ్రీశైలం, గవ్వల రాజలింగం, ఎండి యూసుఫ్ లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసిల ద్వారా గత ప్రభుత్వం 450 కోట్లు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించాలని ఈ ఒక్క సంవత్సరంలో 830 కోట్లు అందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి కర్రే విజయ వీరయ్య, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం మండల చైర్మన్ శిఖ అరవింద్ గౌడ్, ఎండి ఖలీల్, తోట లోహిత, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.