నవ తెలంగాణ -వలిగొండ రూరల్: వచ్చే అసంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆపార్టీ రాష్ట్ర నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం ఆయన రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పైళ్ల శేఖర్ రెడ్డి గెలుపుకై చేస్తున్న ప్రచారంలో భాగంగా శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించికొని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మండలంలోని వేములకొండలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి ఇంటంటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ముద్దాపురంలో ప్రచారం నిర్వహించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టి దక్షిణాది రాష్ట్రాలో మొదటి సారిగా చరిత్ర తిరగరాయబోతున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్ పథకాల మీద ప్రజలకు నమ్మకముందని, రాబంధుల పార్టీ కాంగ్రెస్ దాని పప్పులేమి తెలంగాణలో ఉడకవని, అసత్య ప్రచారాలను, అపోహలు నమ్మి మోస పోద్దని ఓటర్లకు హితవు పలికారు. ఓట్లు దండుకోవడం కోసo ప్రతిపక్షాల నాయకులు కల్లబొల్లి మాటలు చెపుతున్నారని,ప్రజలు వాటిని నసమనే పరిస్థితి లేదని, ఎన్నికల సమయంలో మోసపోతే గోసపడుతామని హితవు పలికారు. భువనగిరి నియోజక వర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, కేసిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సుర్కంటి వెంకట్ రెడ్డి, పనుమటి మమత నరేందర్ రెడ్డి, తుమ్మల వెంకట్ రెడ్డి, ముద్దసాని కిరణ్ రెడ్డి, బోడ లక్ష్మి బాలయ్య, సామ రాంరెడ్డి, ఆకుల వెంకన్న, ఎలిమినేటి జంగారెడ్డి, కొమిరెల్లి సంజీవరెడ్డి, కీసర్ల సత్తిరెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, ఏనుగు అంజిరెడ్డి, సోలిపురం సాగర్ రెడ్డి, కుసంగి రాములు, ఎడ్ల నిరంజన్ రెడ్డి, కేశిరెడ్డి జనార్ధన్ రెడ్డి, డేగల పాండరి, రత్నయ్య తదితరులు పాల్గొన్నారు.