ఇజ్రాయిల్‌ ఘర్షణలపై చీలిన పశ్చిమ, మధ్య ప్రాచ్య దేశాలు

జెరూసలేం : ఇజ్రాయిల్‌-పాలస్తీనా ఘర్షణపై పశ్చిమ దేశాలు, మధ్య ప్రాచ్యం చీలిపోయాయి. అమెరికా జర్మనీ, ఫ్రాన్స్‌ తదితర పశ్చిమ దేశాలు ఇజ్రాయిల్‌ను సమర్ధిస్తుండగా, మధ్య ప్రాచ్య దేశాలు పాలస్తీనా పోరాటానికి మద్దతు ప్రకటించాయి. ప్రస్తుత ఘర్షణలు కొనసాగుతుండడం పట్ల ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫత్తా అల్‌ సిసి, పాలస్తానా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడుకుంటూ భద్రతా, మానవతా పరిస్థితులు క్షీణిస్తుండడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాలు, ఈ ప్రాంత భద్రత, సుస్థిరత ప్రమాదంలో పడే అవకాశాలను ఇరువురు నేతలు చర్చించారు.