హీరో రాజ్ తరుణ్ నటించిన న్యూ ఏజ్ ఎంటర్‌టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్‌వి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి జె.శివసాయి వర్ధన్ డైరెక్టర్. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. మనీషా కంద్కూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ, ‘ఎప్పుడో వచ్చిన ఒక థాట్‌ని సాయికి చెప్తే దాన్ని చాలా అద్భుతంగా మలిచి ఈ సినిమాని చేశాడు. ఇలాంటి పాయింట్‌ని ఫ్యామిలీ అంతా చూసే విధంగా మలిచాడు. కథ, మాటలు, సాంగ్స్, డైలాగ్స్, ఎమోషన్స్ అన్ని పక్కాగా కుదిరాయి. మంచి మెసేజ్ కూడా ఉంటుంది. ప్రజెంట్ జనరేషన్ ఎదుర్కొంటున్న సమస్య ఇందులో ఉంది. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రేక్షకులను నిరుత్సాహపర్చదు. అంత అద్భుతంగా దర్శకుడు శివసాయి దీన్ని తెరకెక్కించాడు’ అని తెలిపారు.