ఉచిత వైద్య శిభిరాన్ని ప్రారంబించిన ఎమ్మెల్యే సతీమణి

నవతెలంగాణ – జుక్కల్

జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెలే క్యాంపు కార్యాలయం ఆవరణలో మండల  కాంగ్రేస్  పార్టీ  ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం  శుక్రవారంనాడు నిర్వహించడం  జర్గింది. ఈ సంధర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్  జూలై 6వ తేదిన పుట్టిన రోజు సంధర్భంగా సతీమణి అర్చన ముఖ్య అథితిగా పాల్గోని ఉచిత కంటి వైద్యశిభిరాన్ని ఓ ప్రముఖ ఆసుపత్రి వైద్యులతో  కలిసి  ప్రారంబించారు. ఈ వైద్య శిభిరానికి నియేాజక వర్గం నుండి ప్రజలు రావాలని గత రెండు రోజుల  క్రితం ప్రకటించారు. నేడు జర్గిన ఉచిత వైద్య శిభిరంలో  బీపీ, షుగర్, గుండే సంభందిత, కంటి వైద్యం పలు రకాలైన జబ్బులకు సంభందించిన పరీక్షలను చేసి ఉచితంగా మందులను పంపిణి చేసారు. వచ్చిన రోగులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. సీరీయస్ కేసులున్న వాటికి జిల్లా ఆసుపత్రులకు రిఫర్ చేసారు. ఈ కార్యక్రమంలో  ఎమ్మెలే  సతీమణి అర్చన, బిచ్కుంద మార్కేట్ కమిటి చైర్మేన్ నాగ్  నాథ్ పటేల్, మండల కాంగ్రేస్ వర్కింగ్ ప్రసిడెంట్ అస్పత్ వార్ వినోద్,సీనీయర్ నాయకులు రమేష్ రావ్ దేశాయి, మాజీ ఎంపిపి లక్ష్మన్ పటేల్ , వైద్య సిబ్బంది తదితరులు  పాల్గోన్నారు.