నవతెలంగాణ- మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని జమా మసీదుకు 65 మీటర్ల దూరంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మద్యం షాపును వెంటనే తొలగించాలని మండల కొప్సన్ ఆయూబ్ ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు మండల తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపిఓ విక్రమ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శేఖర్ లకు వినతిపత్రాలు విరివిగా అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు వైన్స్ షాపు మజీద్ కు దగ్గర నిర్వహించడంతో నమాజులకు, పవిత్రతను ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. ఈ విషయంపై కాటారం ఎక్సైజ్ అధికారులకు పిర్యాదు చేయడంతో మసీదు నుంచి వైన్స్ దుకాణానికి 65 మీటర్ల దూరంలో ఉందని,మసీదు మాత్రం వక్స్ దేవాదాయ శాఖలో లేదని తమను బెదిరించినట్లుగా వాపోయారు.ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మద్యం దుకాణాన్ని తొలగించి,గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టిన వైన్స్ దుకాణం పెట్టిన ఇంటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ఎండి అజ్మట్ అలీ, అబ్జల్ రహీం, మహ్మద్ కసిమ్, ఎండి ఇజ్త, అంకుస్,తాజ్,రాజ్ మమ్మద్,అక్బర్,ఎండి గౌస్ పాల్గొన్నారు.