– కెఎస్‌జి వర్శిటీ బాస్కెట్‌బాల్ లీగ్
హైదరాబాద్: 55 స్కూల్స్, 600కు పైగా అథ్లెట్లు, నాలుగు నెలల పాటు 12 వేదికల్లో 120 మ్యాచులతో ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగిన కెఎస్‌జి వర్శిటీ బాస్కెట్‌బాల్ లీగ్ ఘనంగా ముగిసింది. డ్రీమ్ బాస్కెట్‌బాల్ అకాడమీలో జరిగిన ఫైనల్స్‌లో బార్సు విభాగంలో ఓక్రిడ్జ్ గచ్చిబౌలి చాంపియన్‌గా నిలిచింది. చిరెక్ కొండాపూర్‌పై 80-65తో ఓక్రిడ్జ్ విజయం సాధించింది. గర్ల్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఫ్యూచర్ కిడ్స్ స్కూల్ విజేతగా నిలిచింది. 46-28తో డిపిఎస్ హైదరాబాద్‌పై గెలుపొందింది. ‘పాఠశాల స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కెఎస్‌జి వర్శిటీ బాస్కెట్‌బాల్ లీగ్ మొదలుపెట్టామని కెఎస్‌జి చైర్మన్ అభిషేక్ కంకణాల తెలిపారు. అనంతరం వర్శిటీ స్పోర్ట్స్ ఫౌండర్ రిత్విక్ జంపనతో కలిసి విజేతలకు బహుమతులు అందజేశారు.