మహిళ అనుమానస్పద మృతి..

Suspicious death of womanనవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. మహిళ అనుమానస్పద మృతి తీవ్ర విషాదాన్ని నింపింది. మృతురాలు బాన్సువాడ మండలం మిర్జాపూర్ గ్రామ వాసిగా గుర్తించారు. గత కొన్ని సంవత్సరాల క్రితం బ్రతుకుతెరువు కోసం గోవింద్ పెట్ గ్రామానికి వచ్చి కూలి పని చేస్తూ జీవనం సాగిస్తోందని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. గత ఆరు నెలల క్రితం మహిళ గ్రామానికి వచ్చి ఓ ఇంట్లో అద్దెకు ఉంటుందన్నారు. దర్యాప్తు చేపట్టిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.