కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మాటలు పచ్చి అబద్ధాలు

కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మాటలు పచ్చి అబద్ధాలు– వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు
నవ తెలంగాణ-నర్సాపూర్‌
తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు బూతులు తిట్టడం తప్ప ఎజెండా లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. గురువారం నర్సా పూర్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఈ సభకు హాజరైన మంత్రి హరీష్‌ రావు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి రైతుల అభివద్ధి కోసం కషి చేస్తూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రైతులకు 24 గంటల కరెంటు, రైతుబంధు ,రైతు బీమా పంటల పెట్టుబడి వంటి పథకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఈ మేరకు తెలంగాణలో సమద్ధిగా పంటలు పండుతున్నా యన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ ఆశీర్వదించి సీఎం కేసీఆర్‌ను మూడవసారి మళ్లీ సీఎంను చేయాలన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సునీత రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
సునీత రెడ్డి విజయానికి కషి చేస్తా ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇచ్చిన మాట ప్రకారం సునీత రెడ్డి విజయానికి కషి చేస్తానని ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. సునీత రెడ్డి నేను ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని మరింత అభివద్ధి చేస్తామన్నారు. ఈ మేరకు బిఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీత రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు
ప్రజలు తనను ఆశీర్వదించాలి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత రెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఈ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతా రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు వెంకట్రాం రెడ్డి, రఘోత్తం రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ హేమలత శేఖర్‌ గౌడ్‌. గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ చంద్రం గౌడ్‌, జిల్లా కో ఆప్షన్‌ మెంబర్‌ మన్సూర్‌, లేబర్‌ వెల్ఫేర్‌ బోర్డు చైర్మన్‌ దేవేందర్‌ రెడ్డి, జడ్పిటిసి పబ్బ మహేష్‌ గుప్తా, ఆత్మ కమిటీ చైర్మన్‌ వెంకట్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ రాజు యాదవ్‌, ఎంపీపీ హరికష్ణ, వెంకట్రామిరెడ్డి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్‌ శివకుమార్‌, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్‌, నాయకులు సత్యం గౌడ్‌, బిక్షపతి, నగేష్‌, రమణ గౌడ్‌, అశోక్‌ గౌడ్‌, శ్రీధర్‌ గుప్తా సంతోష్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.