వచ్చే నెలలో రాడార్‌ స్టేషన్‌ పనులు ప్రారంభం

–  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పరిగి నియోజకవర్గంలోని దామగుండం అటవీ ప్రాంతంలో ఇండియన్‌ నేవీకి చెందిన ఫ్రీక్వెన్సీ రాడార్‌ స్టేషన్‌ పనులు ఫిబ్రవరిలో ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. బుధవారం పరిగి ఎమ్మెల్యే రాంమోహన్‌ రెడ్డి, నేవీ కమాండో కార్తిక్‌ శంకర్‌ బందం సచివాలయంలో సీఎంను కలిసి రాడార్‌ స్టేషన్‌ పనులపై చర్చించింది. ఫ్రీక్వెన్సీ రాడార్‌ స్టేషన్‌ గురించి నేవి అధికారులు ఈ సందర్భంగా ఆయనకు వివరించారు. నావికాదళానికు చెందిన భారీ పరికరాలను ఇక్కడ నిర్మిస్తారనీ, దీని ఏర్పాటు వల్ల పరిగి ప్రాంతం అభివద్ధి చెందుతుందని తెలిపారు. నౌకాదళ అధికారులతో సమన్వయం చేసుకొని పనులు త్వరలో ప్రారంభించాలని ఎమ్మెల్యేకు సీఎం సూచించారు. దేవాలయానికి, పర్యావరణానికి హాని కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.