
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల సిసి రోడ్డు నిర్మాణం పనులు ప్రారంబించారు. మంగళవారం మండలంలోని తుక్కాపూర్ గ్రామంలో కాశి ఇళ్లలో రూ. 35 లక్షల సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ పనులను మంజూరు చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజక వర్గ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్ ఏఈ రామ కృష్ణారెడ్డి, ఏపీఎం శ్రీనివాస్, పంచాయ తీ కార్యదర్శి నర్సింగరావు, దుబ్బాక నియోజకవర్గ కోఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి, (అమర్) మండ ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ పాగాల కొoడల్ రెడ్డి, ప్రెస్ క్లబ్ తొగుట మండల అధ్యక్షులు ఉల్లెంగల సాయికుమార్, మండల ప్రధాన కార్యదర్శి చిక్కుడు ఉప్పలయ్య, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లింగాల కృష్ణ, నాయకులు, మాష్టి కనకయ్య, లింగాల వెంకట్, తదితరులు పాల్గొన్నారు.