కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడాలి 

– బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎదల యాదవ రెడ్డి 
నవతెలంగాణ – నెల్లికుదురు 
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రత్యేక కార్యకర్త కష్టపడాలని కోరినట్లు  బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎదల యాదవ రెడ్డి మాజీ జడ్పిటిసి వెంకటేశ్వర్లు కోరినట్టు తెలిపారు మండలంలోని రాజుల కొత్తపల్లి గ్రామంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ తో కలిసి గురువారం గ్రామంలో కలియ తిరిగే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని రాజులకొత్తపల్లి గ్రామంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్ గెలిపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు ముందుకు సాగాలని ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజారిటీ ఓట్లు ఇప్పించే బాధ్యత మనం తీసుకోవాలని అన్నారు. బలరాం నాయక్ గెలిస్తే అక్కడ రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడని దీంతో పార్లమెంటు స్థాయిలో ఉన్న నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతాయని అన్నారు.  ఉపాధి హామీ పథకం లబ్ధిదారులకు కేంద్రంలో ప్రధాన మంత్రిగా రాహుల్ గాంధీ గెలిచిన వెంటనే దినసరి కూలీ రూ.400 రూపాయలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ఇచ్చిందని వారు అన్నారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు డేగల వెంకన్న ఎంపిటిసి వెల్ది గోవర్ధన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు తూళ్ళ నరేందర్  రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ కన్వీనర్ తూళ్ళ ప్రణయ్ తూళ్ళ రామ్మూర్తి యూత్ నాయకులు గడ్డమీది వేణు విజేందర్ తూల్ల వెంకన్న యాకయ్య  రవి శ్రీధర్ మధు పిట్టల యాకయ్య పూస అంజయ్య తదితరులు పాల్గొన్నారు.