ఐదో రోజు కొనసాగిన కార్మికుల సమ్మె

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన సమ్మె సోమవారం ఐదోవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసేవరకు సమ్మె విరమించేది లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సమస్యల పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేయడం సరైనది కాదన్నారు .ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంగారం దుర్గయ్య మామిడి సంపత్, తాడూరి లక్ష్మి, వెంకటేశం, కాసర్ల సదానందం, నాగరాజు, కార్తీక్ నరసవ్వ, తిరుమల పాల్గోన్నారు.