కాటారంలో ఘోర ప్రమాదం

– ఇసుక లారీ ఢీకొని యువకునికి తీవ్ర గాయాలు
– బాదితునికి న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాలు ఆందోళన
నవతెలంగాణ-మల్హర్ రావు/కాటారం: కాటారం మండల కేంద్రంలో గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎర్రగుంట పల్లి గ్రామానికి చెందిన తోట రవి అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయ్యప్ప గుడి ముందు నుండి బైక్ పై వస్తున్న తోట రవిని వెనకాల వస్తున్న ఇసుక లారీ వేగంగా ఢీకొట్టడమే కాకుండా సుమారు కిలోమీటర్ మేర ఈడ్చుకెళ్ళింది. దాంతో రవి రెండుకాళ్ళు నుజ్జునుజ్జయ్యాయి.బాధితునికి న్యాయం చేసి,ఇసుక లారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రజా సంఘాల నాయకులు అక్కల బాపు యాదవ్,దెయ్యం పోచయ్య ఆధ్వర్యంలో సుమారుగా గంటపాటు ప్రధాన రోడ్డుపై ఆందోళన నిర్వహించి,రోడ్డుపై బైఠాయించారు.సంఘటన స్థలానికి కాటారం పోలీసులు చేరుకొని బాదితునికి న్యాయం జరిగేలా చూస్తామనడంతో ఆందోళన విరమించారు.చికిత్స కోసం క్షతగాత్రున్నీ  స్థానికులు,కుటుంబ సభ్యులు హన్మకొండ ఆసుపత్రికి తరలించారు.