నవ తెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత మూడు రోజుల పాటు కొనసాగిన యోగ మహోత్సవం ఆదివారం తో ముగిశాయి. శ్రీరామచంద్ర మిషన్ ,హార్ట్ పుల్ నెస్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ప్రతి రోజు సుమారు రెండు వేల మంది యోగ, ధ్యానం ప్రక్రియ లో పాల్గొన్నారు. ఆదివారం చివరి రోజు యోగ, ధ్యానం, ప్రాణాయామం నిర్వహించారు. శిక్షకుల పర్యవేక్షణ లో ఆసనాలు ఆచరించారు. మరోవైపు రక్తపోటు, షుగర్, ఊబకాయం, లాంటి వాటి నియంత్రణ కోసం ప్రత్యేకంగా అసనాలను నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరి యోగ ,ధ్యానం ఆచరణ చేయాలని సూచించారు. యోగ వల్ల కలిగే లాభాలను వివరించారు. పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి ఆసనాలు వేశారు. ఈ సందర్భంగా ఆసనాలు వేస్తున్న వారికి నిర్వహకులు బలవర్ధకమైన ఆహారం అందించారు. శిక్షకులు నీలిమ, మహిత, రామచంద్ర లు యోగ, ధ్యానం, ప్రాణాయామం నేర్పించారు. ఈ కార్యక్రమంలో హార్ట్ ఫుల్ సంస్థ ప్రతినిధులు స్వరూప, ప్రతిమ, నగేష్,లక్ష్మణ్ చారి, భారతి, భాగ్యలక్ష్మి,మాధవి, మంగ, బొందెయ్య, జ్యోతి లతో పాటు వివిధ జిల్లాల్లో నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.