
యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మండలంలోని స్కూల్ తాండ పరిసర ప్రాంతంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వరాల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన తోకల తిమోతి (30), వృత్తిరీత్యా వరి ధాన్యం ఎండబెట్టు తాటి పత్రాలు రైతులకు కిరాయికి ఇస్తూ, మండలంలోని ఇసన్న పల్లి గ్రామంలో నివాసముంటున్నాడు. ఆదివారం ఇంటి నుండి వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. సోమవారం ఉదయం స్కూల్ తాండ పరిసర ప్రాంతంలోని రోడ్డు ప్రక్కన శవం పడి ఉందని భార్య కోటేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు.