మనస్తాపంతో యువకుడు చెరువులో పడి మృతి

నవతెలంగాణ – మాక్లూర్
తాండ్రి మందలించాడు మనస్తాపంతో యువకుడు హత్మ హత్య చేసుకొని చెరువులో తేలిన సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని బోర్గం (కే) గ్రామ శివారులోని చెరువులో గుర్తు తెలియని శవం సోమవారం లభ్యమైంది. పోలీసులు విచారణ చేపట్టగా మృతుడు నిజామాబాద్ లోని దుబ్బ ప్రాంతానికి చెందిన బందరి సుధాకర్(27) గా గుర్తించారు. మృతుడు తాగుడికి బానిస అయినందున అతని తండ్రి ప్రతాప్ మందలించడంతో మనస్థాపానికి గురై ఈ నెల 10వ తేదీన ఇంటి నుంచి వెళ్లి ఈ రోజు శవమై తేలాడు. మృతుని పై మూడవ టౌన్ పోలీసు స్టేషన్ లో అదృశ్య కేసు నమోదు అయిందని వచ్చారని చేయడంతో తండ్రి ప్రతాప్ వచ్చి చూసి తన కుమారుడే నాని గుర్తు పట్టారు. తండ్రి ప్రతాప్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుదీర్ రావు తెలిపారు.