– ఒక్కసారి అధ్యక్షునిగా అవకాశం ఇవ్వండి
– కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
దుబ్బాక అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుని బరిలో నిలిచినట్లు కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం దుబ్బాక మండల కేంద్రంలో విలేఖర్లతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో 10 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేస్తున్నానని, మహిళలకు ఉచితంగా కరాటే శిక్షణ అందించి వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఉన్నత శిఖరాలకు చేర్చేంచడంతో పాటు కరాటే విద్యార్థులను రాష్ట్ర జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో కరాటే పోటీల్లో బంగారు పథకాలను సాధించే దిశగా వారికి శిక్షణను అందించానన్నారు.తాను ఇప్పుడు దుబ్బాక నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షునిగా బరిలో నిలిచానని, నాపై నమ్మకం ఉంచి నన్ను మీ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని కోరారు. దుబ్బాక నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కార్యక్రమం చేసిన ముందుండి పాల్గొని పార్టీకి అనేక సేవలు అందించాలని వారన్నారు. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే యువత కోసం కొట్లాడి అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అంది స్థానన్నారు. ఈనెల 5వ తేదీ నుండి వచ్చే నెల 5వ తేదీ వరకు జరగబోయే ఆన్లైన్ ఓటింగ్ లో మీ యొక్క అమూల్యమైన ఓటును నాకు అనగా బురాని శ్రీకాంత్ కు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.