
నవతెలంగాణ – దుబ్బాక రూరల్
రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన బాబాయ్ ను చూసేందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో యువకుడు అదృశ్యమైన అక్బర్పేట్ భూంపల్లి మండల పరిధిలోని పోతరెడ్డి పేట గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. యువకుడు కుటుంబ సభ్యులు వివరాల మేరకు పోతరెడ్డి పేట గ్రామానికి చెందిన మ్యాదరి రఘు (17) రామయంపేట్ లో ఇంటర్ చదువుతున్నాడు. మ్యాదరి స్వామి (బాబాయ్) స్వామి ఇటీవల ప్రమాదానికి గురయ్యాడు. దీంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ శనివారం తరలించారు.ఈ విషయం తెలుసుకున్న రఘు తల్లిదండ్రులతో కలిసి చూసేందుకు వెళ్ళాడు. అయితే తిరుగు ప్రయాణంలో రఘు తల్లిదండ్రులు రామయంపేట్ బస్సు ఎక్కగా, రఘు నర్సాపూర్ బస్సు ఎక్కాడు. టికెట్ తీసుకున్న సమయంలో రఘు అదృశ్యమైనట్లు గమనించి, రఘు కోసం కుటుంబీకులు, బంధువులు వెతక సాగారు. రఘు హైదరాబాద్ వెళ్లేటప్పుడు రెడ్ టీ షర్ట్, బ్లాక్ కలర్ పాయింటు, తెలుపు మొఖం, చెవ్వుకి రెండు రింగులు ధరించి ఉన్నట్లు బంధువులు తెలిపారు. పై ఫోటోలో ఉన్న యువ కుడి వివరాలు తెలిస్తే 9505752303, 9849933034,7780256137 నంబర్లకు సంప్రదించాలని కోరుతున్నారు.