అత్తారింటికి వెళ్తానని అల్లుడు కనిపించకుండా పోయిన ఘటన మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పెరిక రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సింగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన పచ్చిపాల లింగరాజు (25) ఈ నెల 13న చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామంలోని తన అత్త మామల ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. ఇప్పటికీ అక్కడకు వెళ్ళకపోవడంతో పాటు ఆచూకీ లభించకపోవడంతో అతని తండ్రి పచ్చిపాల మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అతని వద్ద ఫోన్ కూడా లేదని, బంధువులకు ఫోన్ చేసినా ఆచూకీ లభించలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.