కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువత

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలం కందకుర్తి గ్రామానికి చెందిన వివిధ పార్టీల నుంచి యువత కాంగ్రెస్ అభ్యర్థి పి సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ లో చేరినట్లు వారు పర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మొబిన్ ఖాన్, బోధన్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, గయా సోదిన్, నాగభూషణం రెడ్డి, సాయి రెడ్డి, లచ్చివార్ నితిన్, జావిద్ ఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.