ఆళ్ళపల్లి యువత అభినందనీయం 

– ఎస్సై ఈ.రతీష్
నవతెలంగాణ – ఆళ్ళపల్లి :
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని ఇల్లందు పట్టణంలో డీఎస్పీ ఎస్.వి.రమణమూర్తి ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి గురువారం ఆళ్ళపల్లి మండలం నుండి యువత అధిక సంఖ్యలో హాజరై, రక్త దానం చేశారని, వారు అభినందనీయులని స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్సై ఈ.రతీష్ కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ఈ రక్తదాన శిబిరంలో డీఎస్పీతో పాటు తాను, కానిస్టేబుల్ వై.శ్రీనివాసరావు రక్తదానం చేశామన్నారు. రక్తదానం చేసిన వారు చిరస్థాయిగా ప్రాణ దాతలుగా నిలుస్తారని చెప్పారు. రక్తదానం చేసిన వారి ఆరోగ్యం ఎప్పుడూ చురుగ్గా ఉంటుందని సెలవిచ్చారు. రక్తదానం చేసిన వారికి మెమెంటోలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. రక్తదానం చేసిన స్థానిక యువత జి. ప్రశాంత్, జంపన్న, రాంబాబు, నవీన్, శ్రీకాంత్, రాజేష్, రాజశేఖర్, సిద్దుతో పాటు సంఘసంస్కర్త గుండెబోయిన రామకృష్ణ రక్తం ఇచ్చారు.