ఎమ్మెల్యేను సన్మానించిన మాదాపూర్ యువకులు

– గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి

– నవతెలంగాణ – జక్రాన్ పల్లి
జక్రాన్ పల్లి మండల్ మాదాపూర్ గ్రామానికి చెందిన యువజన నాయకులు మరియు మాదాపూర్ గ్రామ యువకులు నిజాంబాద్ డాక్టర్ భూపతి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది. గ్రామ సమస్యలు,  గ్రామంలో శివాలయం యొక్క బోరు, కాంపౌండ్ వాల్ కావాలని కోరారు. దానికి ఎమ్మెల్యే  సానుకూలంగా స్పందించి చేస్తానని హామీ ఇచ్చారు .ఈ కార్యక్రమంలో జక్రాన్ పల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సొప్పరీ వినోద్ వీడీసీ ప్రెసిడెంట్ నవీన్ టెంపుల్ చైర్మన్ ప్రశాంత్ కమిటీ  సభ్యులు పెంటాద్రి వంశి సందీప్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.