- నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్
నవతెలంగాణ కంఠేశ్వర్: స్వతంత్ర సమర యోదులు మాన్యం వీరులు అల్లూరి సీతారామ రాజు జయంతి సందరంగా నిజామాబాద్ నగరంలోని కోటగల్లిలోని విగ్రహానికి పూలమాలా వేసి నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ గురువారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతు.. ఆంగ్లేయులకు వ్యతిరేఖంగా ప్రజలకు విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసారని నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి మత్తు ప్రదర్థలపై పోరాటం చేయలని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్పోరేటర్ ధర్మపురి నాయకులు సుదర్శన్, రాజేశ్వర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.