– సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-మట్టెవాడ
సీపీఎం నేత పుచ్చలపెల్లి సుందరయ్య ఆశయ సాధన ను స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు సాగాలని కేంద్ర కమిటీ సభ్యులు, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు జి. నాగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం రంగశాయిపేట ఏరి యా కమిటీ కార్యదర్శి మాలోతు సాగర్ అధ్యక్షతన సుందర య్య 38వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సమావే శానికి ముఖ్యఅతిథిగా జి.నాగయ్య హాజరై సుందరయ్య చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశ కమ్యూని స్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశ యాలతో యువత ముందుకెళ్లాలని కొనియాడారు. పుచ్చల పల్లి సుందరయ్య నెల్లూరు జిల్లా అలగానిపాడులో జన్మిం చారని, ఆయన భూస్వామి కుటుంబం నుంచి వచ్చిన పేద లు రైతుల కోసం అనేక పోరాటాలు తెలంగాణ సాయుధ పోరాటాలు నిర్వహించారు. మొట్టమొదటగా వ్యవసాయ కా ర్మికులు ఇబ్బంది పడుతున్నారని వ్యవసాయ కార్మిక సంఘా న్ని స్థాపించి కూలిరేట్లు కోసం పోరాటం నిర్వహించిన మహా నాయకుడు సుందరయ్య అన్నారు. తన యావదాస్థి మొత్తం కూడా పేదలకుఅంకితం చేసిన మహా నాయకుడు సుందర య్య అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి రంగయ్య, రంగశాయిపేట ఏరియాకమిటీ సభ్యులు మాలోతు ప్రత్యు ష, సాంబముర్తి, గణేపాక ఓదెలు, లక్క రమేష్, రత్నం దా సు, జ్యోతి, సోషల్ మీడియా కార్యదర్శి గజ్జ చందు, కేవీపీస్ ఏరియా కార్యదర్శి ఉసిల్ల కుమార్, శాఖ కార్యదర్శులు పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్జీవోస్ కాలనీ : సీపీఎం జిల్లా కార్యాలయం హను మకొండలో శుక్రవారం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వ ర్ధంతి సీసీఎం జిల్లా కమిటీ సభ్యులు గొడుగు వెంకట్ అధ్య క్షతన జరిగింది. ఈ సందర్భంగా సుందరయ్య చిత్ర పటా నికి సీపీఎం సీనియర్ నాయకులు కల్లెపు వెంకటయ్య, బొట్ల చక్రపాణిలు పూలమాల వేసి నివాళులర్పించారు. అనం తరం వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో 1936 లో నే వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేసి అణిచివేత కు గురవుతున్న పేదలను ఒకవేదికపైకి తెచ్చి, కూలీరేట్ల పెం పుదలేకాక, కుల అణిచివేతకు వ్యతిరేకంగా ఉద్యమాలు సా ధించారన్నారు. ఆ రోజులలోనే సహపంక్తి భోజనాలు ఏర్పా టుచేసి కుల వివక్షతపై తిరుగుబాటు చేశారన్నారు. ఆంధ్ర లో అంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనేకాక, తెలంగాణలో నైజాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం’కు నాయకత్వం వహించారన్నా రు. చదువురాని అనేకమందిని పోరాట నాయకులుగా త యారు తయారు చేశారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనేకాక భా రత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుకు కార్యదర్శిగా పని చేసి దే శంలో పోరాటాలకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వహిం చిందన్నారు. భూసమస్య, ఉపాధి సమస్య, సాంఘిక సమ స్యలు, ప్రాంతీయ విబేధాలు తదితర అన్ని సమస్యలకు పా ర్లమెంట్‌లోనేకాక శాసనసభలలో చర్చించి అమలు చేశార న్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లక్షలాది ఎకరాల భూపంపిణీ చేయడానికి ఈ పోరాటాలు దోహదపడ్డాయన్నారు.
ప్రజలే తన సంతానంగా భావించి కషి తన యావదాస్తిని పార్టీకి, పార్టీ పత్రికకు ఇచ్చేశారన్నారు గ్రామీణ వ్యవసాయ కార్మికులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వేత నాలు పెంచుకోవడం, భూమిని కలిగి ఉండే విధంగా ఉద్య మాలు నిర్మించాలన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి భూ సమస్యను సష్టించాయని కార్పొరేట్లకు, ఫాం హౌ జ్‌లకు వందలాది ఎకరాల భూములు సేకరిస్తు పేదలను భూముల నుండి తరిమివేస్తున్నారు ఎక్కడికి అక్కడ భూము లు కొల్పోయిన ప్రజలు పెద్దఎత్తున ఉ ద్యమాలు నిర్వహిస్తు న్నారన్నారు. ఉద్యమాలపై ప్రభుత్వాలు నిర్బంధం సాగించి నప్పటికీ సుందరయ్య స్పూర్తితో సాగిస్తున్న పోరాటాలు ఫలి తాలు సాధిస్తున్నామన్నారు. అదేస్ఫూర్తితో భవిష్యత్‌లో ఉద్య మాలు నిర్మించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు జి. ప్రభాకర్‌రెడ్డి, నాయకులు మాడరాజు రమాదేవి, సాంబ య్య, ఎల్లమ్మ, సాంబాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ : కడదాకా ప్రజాసేవకై తన జీవితాన్ని అం కితమిచ్చిన కమ్యూనిస్ట్ నాయకుడు పుచ్చలపల్లి సుందర య్య అని సీపీఎం హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు, సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ అన్నారు. శుక్రవారం 31వ డివిజన్, మహాత్మా జ్యోతిరావు పూలే నగర్, ఎమ్మార్ భవన్‌లో సుందరయ్య 38వ వర్దంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంత రం వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమర పోరాటమందు, కొదమ సింహమైగర్జించి, దక్షిణ భారతదేశంలోనా కమ్యూ నిస్టు ఉద్యమాన్ని నిర్మించి, జీవితమంటే ఉద్యమం, ఉద్య మమే నీ ఉపిరి అన్న వ్యక్తి సుందరయ్య అని కొనియాడారు. ఎర్రజెండాకే వన్నెతెచ్చి, పీడిత జననేత సుందరయ్య అన్నా రు. ఉన్నది పంచిపెట్టడమే తప్ప దోచుకోవడం, దాచుకోవ డం తెలియని ఆదర్శ కమ్యూనిస్ట్ నాయకుడు ప్రజల మనిషి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నేటి సమాజానికి అవస రం అన్నారు. ప్రతిఒక్కరికీ పని,తినడానికి తిండి, వేసుకోడా నికి బట్ట, ఉండడానికి నీడ, విద్యా, వైద్యం గ్యారంటీగా అం దించడం కోసం ఆయన పాటుపడ్డాడని అన్నారు.
కానీ ఇప్పటికి మనదేశంలో పని కోసం ఎదురుచూస్తు న్నారని, తినడానికి తిండిలేక ఇబ్బందులు పడుతున్నారని, తల దాచుకోడానికి ఇండ్ల కోసం పోరాటాలు చేస్తున్నారని, విద్యా ఒక వ్యాపారంగా, వైద్యం ఉన్నమారాజులకే అన్నట్లు ఉందన్నారు. కాబట్టి ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసు కుని వాటిని సాదించుకోవడం కోసం పాటుపడలన్నారు. ఈ కార్యక్రమంలో సౌత్‌మండల సభ్యులు దూడపాక రాజేందర్, కంచర్ల కుమరస్వామి, ఎన్నాం వెంకటేశ్వర్లు, శ్రావణి, పుల క్క, స్వరూప, లలిత తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి : కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయా లను ఆచరణలో పెట్టడానికి కృషిచేయాలి అని సీపీఐ (ఎం) మండల కార్యదర్శి మాదాసి యాకూబ్ అన్నా రు. సుంద రయ్య 38వ వర్ధంతి సందర్భంగా శుకవ్రారం ఆ యన చిత్ర పటానికి పూలమాలవేసి నివాళలర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల విముక్తి కోసం, సమ సమాజ మార్పు కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు పుచ్చలపల్లి సుందరయ్య అని కొనియాడారు.
దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించిన గొప్ప వ్యక్తిఅని పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం, సామాజిక అణిచివేతపై తిరుగు లేని పోరాటం చేసిన మహనీయుడన్నారు. తెలంగాణ సా యుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని నిరుపేదలైన పేదలకు భూ పంపిణీ చేసిన గొప్ప నాయకుడని చరిత్ర ఉ న్నంత కాలం సుందరయ్య పేరు పేదల తలలో నాలుక లెక్క కొనియాడుతారని వారు పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి కార్యకర్త కంకణబద్ధులై అంటిపెట్టుకొని అంకిత భావంతో ప్రజా సమస్యల ఎడల అంకుటిత దీక్షతో వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని వారు పేర్కొన్నారు. సుందరయ్య చూపిన మార్గం లో మనమందరం సమాజ మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయు మండల కార్యదర్శి జిల్లా రమేష్ నాయకులు చిన్నపెల్లి కుమార్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.