మద్నూర్ మండలంలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం చురుగ్గా సాగాలని ఈ కార్యక్రమం విజయవంతానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జడ్పి సీఈఓ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చందర్ నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామపంచాయతీ కమ్యూనిటీ ప్లాంటేషన్లో మోడల్ స్కూల్ విద్యార్థులతో పాటు పాల్గొన్నారు. అనంతరం మద్నూర్ గ్రామ నర్సరీని సందర్శించి మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లకు అలాగే ఉపాధి హామీ సిబ్బందికి రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రాణి మండల పంచాయతీ అధికారి వెంకట నరసయ్య మండల ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి పద్మ మండలములో గ్రామ కార్యదర్శులు ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.