టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా తీన్మార్‌ మల్లన్న

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తీన్మార్‌ మల్లన్నకు ఆ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్‌గా ఆయన్ను నియమించింది. ఈమేరకు గురువారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ కమిటీకి ఎల్బీనగర్‌ అభ్యర్థి మధుయాష్కీగౌడ్‌ ప్రచార కమిటీ చైర్మెన్‌గా కొనసాగుతున్నారు.