మద్యం దుకాణంలో దొంగతనం

మద్యం దుకాణంలో దొంగతనంనవతెలంగాణ-నస్పూర్‌
శ్రీరాంపూర్‌ ఏరియా బస్టాండ్‌ సమీపంలోని హరిహర మద్యం దుకాణంలో దొంగతనం జరిగింది. దుకాణం నిర్వాహకులు శుక్రవారం షాప్‌ తెరవడంతో దుకాణం పైకప్పు పగిలి ఉంది. దొంగతనం జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. శ్రీరాంపూర్‌ సీఐ మోహన్‌, ఎస్‌ఐ సంతోష్‌ ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలించారు. కెమెరాల్లో దొంగ తనానికి పాల్పడ్డ వ్యక్తి కనిపించినప్పటికి అతని వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇట్టి విషయమై ఎస్‌ఐ సంతోష్‌ను వివరణ కోరగా మద్యం దుకాణం యజమాని ఎలాంటి పిర్యాదు ఇవ్వలేదని పేర్కొన్నారు. దొంగతనం జరిగినప్పటికీ పిర్యాదు ఇవ్వకపోవడం గమనార్హం.