రాత్రి మేనూర్ పర్టిలైజర్ షాపులో దొంగతనం..

నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ ఉమ్మడి మండలంలో దొంగతనాలు పొందుకుంటున్నాయి ఇటీవల మండలంలోని మద్నూర్ గ్రామ పరిధిలోని వైన్స్ షాపులో దొంగతనం జరిగింది. మేనూర్ శివారు పరిధిలో అయ్యప్ప సన్నిధిలో దొంగతనాలు జరిగే పంచ లోహాలను అపహరించక పోయారు. ఆ తర్వాత ఉమ్మడి మండలంలోని నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండలంలోని మోగా గ్రామంలో పశువులను ఆహ్వానించారు .ఆ తర్వాత ఆదివారం అర్ధరాత్రి మేనూరు గ్రామంలోని కిసాన్ ఫర్టిలైజర్ షాపులో దొంగలు పడ్డారు ఈ ఘటన సమాచారాన్ని తెలుసుకున్న ఎస్సై శ్రీకాంత్ సోమవారం ఉదయం మేనూరు గ్రామాన్ని సందర్శించి, దొంగతనానికి గురైన కిసాన్ ఫర్టిలైజర్ షాపును పరిశీలించారు. షాపు వెనుక భాగం షెటర్ నుండి పైన గల రేకును తొలగించి దుకాణంలోకి త్వరపడి చివరికి పాల్పడ్డారు. జరిగిన దొంగతనంపై విచారణ చేపట్టారు. ఇటీవల కాలంలో దొంగతనాలు జరిగిన వాటిపై ఎస్సై శ్రీకాంత్ దొంగల వేటలో నిఘా పకడ్బందీగా చేపడుతున్నారు. జరిగిన దొంగతనాలపై త్వరలోనే దొంగలను పట్టుకుని పనిలో ఎస్సై కసరత్తులు చేస్తున్నారు. అక్కడక్కడ దొంగతనాల జోరు రోజురోజుకు పెరగడం ఉమ్మడి మండల ప్రజల్లో దొంగతనాల పట్ల ఆందోళన చెందుతున్నారు. జరిగిన దొంగతనాల పై పోలీస్ శాఖ దొంగలను త్వరగా పట్టుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.