నవతెలంగాణ – కంటేశ్వర్
నగరంలోని ప్రభుత్వ పాఠశాలలో చోరి జరిగిన ఘటన నిజామాబాద్ రెండవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాము తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శంకర్ భవన్ పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు చొరబడ్డారు. అయితే మంగళవారం ఉదయం ఉపాధ్యాయులు గమనించి రెండు ట్యాబ్ అపహరించినట్లు పోలీసులకు తెలియజేశారని రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ తెలిపారు. పోలీసు లకు సమాచారం అందడంతో పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐఐ రాము పేర్కొన్నారు.