మెడికల్ షాపులో చోరీ ..

Theft in medical shop..– సుమారు రూ.5 లక్షల నగదు డివిఆర్ మాయం 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో దొంగలు హల్చల్ చేశారు. మెడికల్ షాప్ ల చోరీ చేసి సుమారు రూ.5 లక్షల నగదు డివిఆర్ ఎత్తుకెళ్లినట్లు తెలిసింది. నిజామాబాద్ నగరంలో ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతమైన సరస్వతినగర్ లోని ఓక ప్రైవేట్ హస్పీటల్ ల్ జాయింట్ మెడికల్ కౌంటర్ లో చోరికి పాల్పడ్డారు. పాత అర్డిఓ కార్యాలయం ఎదురుగా గల ప్రసాద్ పిల్లల ఆస్పత్రి అనుబంధ వర్నియా పార్మసీలో సోమవారం రాత్రి దోంగలు చోరి చేశారు. షట్టర్ తాళాలు పగుల గొట్టి కౌంటర్ లో ఉన్న రూ.5 లక్షల నగదు ను దొంగిలించారు. చోరి జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటివి డివిఆర్ తో పాటు తాళాలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగు చూసింది. మెడికల్ లో రూ.5 లక్షలు ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నగరంలో అత్యంత రద్దీ ప్రాంతంలో చోరి పోలిస్ ల భద్రత వైఫల్యాలను, యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. స్థానిక ఆస్పత్రి మెడికల్ నిర్వాహకుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఓకటవ టౌన్ పోలీసులు వివరాల అడిగి తెలుసుకొని మెడికల్ లో క్షుణ్ణంగా పరిశీలించారు.