ఎల్లమ్మ దేవాలయంలో చోరీ..

నవతెలంగాణ – తొగుట

మండలంలోని జప్తి లింగారెడ్డి పల్లి గ్రామ సమీపంలో ఉన్న రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయం తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. ఆలయంలో అమ్మవారికి చెందిన ఆబరణాలు ముక్కు పుడక, కమ్మలు చోరీకి గురై నట్లు గుర్తించారు. ఆలయంలో హుండీ ఎత్తుకెళ్ళి నగతు దొంగిలించారు. సంఘటన స్థలానికి తొగుట ఎస్ఐ లింగం పరిశీలించి విచారణ చేపట్టారు.