నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో పంట డబ్బులు డ్రా చేసిన రైతు ఐలాపురం నడిపి పోశెట్టి దగ్గర నుండి ఓ మహిళ రెండు లక్షల రూపాయలు చోరీ చేయగా సి సి పుటేజి ఆధారంగా రికవరీ చేసినట్లు తెలిసింది. మండల కేంద్రంలోని తడగాంకు చెందిన బాధితుడు ఐలాపురం నడిపి పోశెట్టి తెలిపిన వివరాల ప్రకారం పంట డబ్బులు డ్రా చేసేందుకు స్థానిక ఎస్బిఐ బ్యాంకులో రెండు లక్షలు డ్రా చేసి కొత్త పాస్ బుక్ తీసుకునే క్రమంలో గుర్తుతెలియని మహిళ డబ్బులు చోరీ చేసి వెళ్లిపోయింది. తర్వాత డబ్బులు చోరీకి గురయ్యాయని గమనించిన బాధితుడు మేనేజర్ కు సమాచారం ఇవ్వడంతో సిసి ఫుటేజీ ద్వారా అనుమానం ఉన్న ఓ మహిళ సమాచారం తెలుసుకొని ఇంటికి వెళ్లి బెదిరించగా డబ్బులు రికవరీ అయినట్లు తెలిపారు.