
మండల కేంద్రమైన కుభీర్ లోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో శనివారం చోరీ జరిగినట్లు ఎస్ ఐ రవీందర్ తెలిపారు. కుభీర్ రాజన్న గౌడ్ రేణుక ఎల్లమ్మ ఆలయాన్ని శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆలయానికి వెళ్లగా.. అక్కడ ఆలయం తలుపులు పగలగొట్టి ఉండడంతో వెంటనే ఆలయంలోకి వెళ్లి చూశారు. ఆలయ గుడి గంట, గ్యాస్ సిలెండర్ ను శుక్రవారం రాత్రి సమయంలో దోనగలించినట్లు పోలిసులు తెలిపారు. వారు శనివారం పాంగ్రా గ్రామ శివారు ప్రాంతంలో పోలిసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. ఇద్దరు వ్యక్తులు టివిఎస్ ఎక్సెల్ టి ఎస్ 18 డి 7118 గలా బండిపై గుడి గంట, గ్యాస్ సిలెండర్ తీసుకువెళ్తుండగా వారిని వెంబడించి పట్టుకొని పోలిస్ స్టేషన్ కు తీసుకువచ్చి ఇద్దరిని రిమాండ్ కు పంపుతునట్లు ఎస్ ఐ రవీందర్ తెలిపారు.