ఆర్టీసీ బస్సులో చోరీ..   

Theft in RTC bus..నవతెలంగాణ – ముధోల్ 
బాసర నుండి భైంసా వెళుతున్న ఆర్టీసీ బస్సులో సోమవారం రోజు దొంగతనం జరిగింది.ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులకు చెందిన మూడు ఫోన్లు దొంగలు దొంగలించారు‌. దీంతో బాధితులు  ఆలస్యంగా గమనించి వెంటనే బస్సు డ్రైవర్ కు తెలిపారు. డ్రైవర్ వెంటనే బస్సును ముధోల్  పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. పోలీసులు బస్సులో ఉన్న ప్రయాణికులను తనిఖీ చేశారు.అయినప్పటికీ చోరీకీ గురి అయిన పోన్ లు దొరకలేదు. దొంగతనంకు  పాల్పడిన వ్యక్తి వచ్చే రూట్లో ఎక్కడైనా దిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.