నవతెలంగాణ – బజార్ హత్నూర్
మండలంలోని గిర్నూర్ గ్రామ సమీపంలోని శ్రీ లక్ష్మి సాయి వైన్స్ లో గుర్తుతెలియని దొంగలు శుక్రవారం తెల్లవారుజామున వైన్స్ సెటర్లు పగలగొట్టి అందులో ఉన్న 2 లక్షల విలువ చేసే మద్యం 15 వేల నగదును చోరీ జరిగినట్లు వైన్స్ నిర్వాహకులు పాతేసింగ్ తెలిపారు. ఈ చోరీ విషయం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఇవాళ ఉదయం సీఐ రమేష్ , స్థానిక ఎస్ఐ నరేష్ లు వచ్చి పరిశీలించినట్లు నిర్వాహకులు తెలిపారు. డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీం తో తనిఖీలు చేయిస్తామని సీఐ రమేష్ తెలిపినట్లు వైన్స్ నిర్వాహకులు పాతేసింగ్ తెలిపారు. వైన్స్ లో చోరీ జరగడం ఇదే మొదటిసారి.వైన్స్ లో దొంగతనం పై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ సాగించారు. వైన్స్ షాప్ యజమాని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.